e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ఈట‌ల భూక‌బ్జా.. సీఎం కేసీఆర్‌కు బాధితుల లేఖ‌

ఈట‌ల భూక‌బ్జా.. సీఎం కేసీఆర్‌కు బాధితుల లేఖ‌

ఈట‌ల భూక‌బ్జా.. సీఎం కేసీఆర్‌కు బాధితుల లేఖ‌

హైద‌రాబాద్ : రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జాల‌పై బాధిత వ్య‌క్తులు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం.. మెద‌క్ జిల్లా మాసాయిపేట మండ‌లం అచంపేట్, హ‌కీంపేట్ గ్రామాల‌కు చెందిన బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన చాక‌లి లింగ‌య్య‌, చాక‌లి బిచ్చ‌వ్వ తండ్రి పెద్ద వెంక‌ట‌య్య‌, చాక‌లి కృష్ణ బిచ్చ‌వ్వ‌, చాక‌లి నాగులు, చాక‌లి పరుశురాం తండ్రి నాగులు, ఎరుక‌ల దుర్గ‌య్య‌, ఎరుక‌ల ఎల్ల‌య్య‌, ఎరుక‌ల రాములు అనే తాము స‌విన‌య‌ముగా విన్న‌వించున‌ది ఏమ‌న‌గా, ప్ర‌భుత్వం వారు 1994 సంవ‌త్స‌రంలో మాకు అన‌గా.. చాక‌లి లింగ‌య్య‌, చాక‌లి బిచ్చ‌వ్వ తండ్రి పెద్ద వెంక‌ట‌య్య‌, చాక‌లి కృష్ణ స‌నాఫ్ బిచ్చ‌వ్వ‌, చాక‌లి నాగులు, చాక‌లి ప‌రుశురాం తండ్రి నాగులు కుటుంబాల‌కు స‌ర్వే నంబ‌ర్ 130/5, 130/9, 130/10 ల‌లో ఒక్కో కుటుంబానికి ఒక ఎక‌రం 20 గుంట‌ల చొప్పున‌, ఎరుక‌ల దుర్గ‌య్య‌కు స‌ర్వే నంబ‌ర్ 64/6 లో 3 ఎక‌రాలు, ఎరుక‌ల ఎల్ల‌య్య‌, ఎరుక‌ల రాములుకు కొంత భూమిని అసైన్డ్ భూముల కింద కేటాయించడం జ‌రిగింది. గ‌త కొన్ని నెల‌లుగా రాష్ర్ట మంత్రి ఈట‌ల రాజేంద‌ర్, అత‌ని అనుచ‌రులు సూరి @ అల్లి సుదర్శ‌న్, యంజాల సుధాక‌ర్ రెడ్డిలు మా గ్రామాల భూములను స్వాధీన‌ప‌రుచుకొన్నారు. ఒక ప‌థ‌కం ప్ర‌కారం వాటి క‌బ్జా ప్ర‌క్రియ‌కు తెర‌లేపినారు.

ఆ ప‌థ‌కంలో భాగంగా వారు మ‌మ్మ‌ల్ని, మీ భూముల‌ను ప్ర‌భుత్వం తిరిగి స్వాధీన ప‌రుచుకుంటుంది అని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి మాతో పాటు దాదాపు 100 మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల‌కు చెందిన రైతుల యొక్క భూ కేటాయింపు స‌ర్టిఫికేట్ ల‌ను దౌర్జ‌న్య‌ముగా వారు మా వ‌ద్ద నుంచి స్వాధీన‌ప‌రుచుకున్నారు.

వారి భూ దాహానికి మా ఇరు గ్రామాల ప‌రిధిలోని సుమారు 100 ఎక‌రాల అసైన్డ్ భూములు క‌బ్జాకు గురి అయ్యాయి. అట్టి భూముల్లో వారు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఒక పెద్ద పౌల్ర్టీ ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు ఎటువంటి అనుమ‌తులు లేకుండానే అక్ర‌మంగా షెడ్‌ల నిర్మాణం యధేచ్చ‌గా కొన‌సాగిస్తున్నారు.

అక్ర‌మంగా భూముల‌ను క‌బ్జా చేయ‌డ‌మే కాక‌, వారి కార్య‌క‌లాపాల‌కు అడ్డుప‌డుతున్న కొంత‌మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల‌కు చెందిన రైతుల‌ను వారి చుట్టుప‌క్క‌ల ఉన్న భూముల‌ను కూడా క‌బ్జా చేసి వారికి దారికి ఇవ్వ‌కుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే నువ్వు కూడా నీ భూమి అమ్ముకో.. లేదంటే నీ భూమికి శాశ్వ‌తంగా దారి లేకుండా చేస్తామ‌ని బెదిరిస్తూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని అట్టి వారిపై జులుం చేస్తున్నారు. అయ్యా ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మాలాంటి నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల‌కు చెందిన రైతుల‌కు స‌రైన న్యాయం త‌మ‌రి ఒక్క‌రి వ‌ల్లే జ‌రుగుతుంది. కావున మా ప్రార్థ‌న మ‌న్నించి త‌మ‌రు త‌క్ష‌ణ‌మే మంత్రి ఈట‌ల రాజేంద‌ర్, అత‌ని అనుచ‌రుల యొక్క క‌బంద హ‌స్తాల‌లో క‌బ్జాకు గురైన మా అసైన్డ్ భూముల‌ను వారి చెర నుంచి విడిపించి మాకు అట్టి భూముల‌పై హ‌క్కులు క‌ల్పించ‌గ‌ల‌ర‌ని మిమ్మ‌ల్ని స‌విన‌య‌ముగా వేడుకుంటున్నాం.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈట‌ల‌పై అభియోగాల ద‌ర్యాప్తున‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

వెలుగులోకి మంత్రి ఈట‌ల భూక‌బ్జా బాగోతం..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈట‌ల భూక‌బ్జా.. సీఎం కేసీఆర్‌కు బాధితుల లేఖ‌

ట్రెండింగ్‌

Advertisement