Video | ఎమిరేట్స్‌లోని హైవేపై గంటకు 280 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై దూసుకెళ్లాడు. అంతే కాకుండా బైక్‌తో స్టంట్స్ చేశాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన దుబాయి పోలీసులు అరెస్టు చేసి కటకటలాల్లోకి పంపారు. ఈ మేరకు పోలీసులు యువకుడి బైక్ రైడింగ్ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వీడియో అందరినీ షాక్‌కు గురి చేస్తున్నది. సదరు యువకుడు అతివేగంగా, నిర్లక్ష్యంగా బైక్‌ను నడుపుతూ చేసిన విన్యాసాలను వీడియోలో కనిపించాయి. బైక్ ఫ్రంట్ టైర్‌ను గాల్లోకి లేపుతూ అదే స్పీడ్‌తో బైక్‌ను నడిపించడం కనిపించింది.
Speeding Rider Faces Legal Action for Racing at 280 km/h, Motorcycle Seized
According to Decree No. 30 of 2023 regarding vehicle impoundment, a fine of up to 50,000 AED is imposed for releasing the seized motorcycle. pic.twitter.com/sUd9OCDVQ8
— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) October 27, 2023
దుబాయి పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తికి 50వేల దిర్హామ్స్ (భారతీయ కరెన్సీలో రూ.11.33లక్షలు) జరిమానా విధించారు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో దుబాయి ప్రభుత్వం ట్రాఫిక్ చట్టాలను సవరించింది. రోడ్లపై మోటార్ సైకిల్‌ను నిర్లక్ష్యంగా, ప్రాణ, ఆస్తి నష్టం కలిగించే రీతిలో నడపడం నేరం. నకిలీ, చదవలేనివిధంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించిన నంబర్ ప్లేట్‌తో డ్రైవింగ్ చేయడం, పోలీసుల వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేయడం నేరంగా పేర్కొంది.
#News | Dubai Police Take Legal Action Against Reckless Motorcyclist for speeding at 280 km/, Seize Motorcycle
Details: https://t.co/J3svhlx39C#YourSecurityOurHappiness#SmartSecureTogether pic.twitter.com/9IZQehUop2
— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) October 27, 2023