Usha Vance | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ క్యాపిటల్‌లో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్.. ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా (Vice President of the United States) జేడీ వాన్స్ (JD Vance) సైతం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి (Usha Vance) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Usha Vance made history as the first Indian-American and Hindu ‘Second Lady’ after her husband, #JDVance, was sworn in as the 50th #VicePresident of the United States.#UshaVance is the daughter of Telugu immigrants from India, Radhakrishna “Krish” Chilukuri, an aerospace… pic.twitter.com/Aphu22XoI0
— All India Radio News (@airnewsalerts) January 20, 2025
జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భార్య ఉషా చిలుకూరి వాన్స్, ముగ్గురు పిల్లలూ ఆయన పక్కనే ఉన్నారు. తన భర్త జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఉషా వాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన భర్త వైపు ఎంతో గర్వంగా, ప్రేమగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Get a spouse who looks at you like Usha Vance.
pic.twitter.com/vFDrKXnJZp— Ainkareswar (@kainkareswar) January 20, 2025
ఉపాధ్యక్షుడు.. తెలుగింటి అల్లుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడు కావడం విశేషం. ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్ తెలుగువారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్, లక్ష్మి చిలుకూరి ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలోని శాన్‌డియాగోలో ఉష జన్మించారు. యేల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. లా చదివే రోజుల్లోనే జేడీ వాన్స్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2014లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం కెంటకీలో వీరి వివాహం జరిగింది.
అమెరికా సెకెండ్ లేడీ అయిన తొలి హిందూ అమెరికన్
ఉష, వాన్స్ దంపతులకు ఎవాన్, వివేక్, మిరాబెల్ రోజ్ అనే పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు కావడంతో అగ్రరాజ్యం అమెరికా సెకండ్ లేడీ హోదా ఉషకు దక్కింది. అమెరికా సెకండ్ లేడీ అయిన మొదటి ఏషియన్ అమెరికన్, హిందూ అమెరికన్ ఉషనే కావడం విశేషం. కాగా, మిలిటరీ జర్నలిస్టుగా, రచయితగా పేరొందిన జేడీ వాన్స్ 2022లో ఓహియో సెనేటర్‌గా విజయం సాధించారు. 2016లో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి వాన్స్ ఆ తర్వాత ట్రంప్ మద్దతుదారుగా మారి, ఏకంగా ఉపాధ్యక్షుడిగా అవకాశం పొందారు.
The difference in class is undeniable #ushavance 🤩🤩 pic.twitter.com/3MzNDDMeBg
— Jonsey (@joneslillycal) January 20, 2025
Can we talk about how beautiful #UshaVance looks in the perfect peony Oscar de la Renta coat and tea length dress today? Stunning! pic.twitter.com/zNhFXUomfJ
— Chrissi Miller (@Chrissi16228964) January 20, 2025
Also Read..
Donald Trump | స్వర్ణయుగం మొదలైంది.. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తా: డొనాల్డ్ ట్రంప్
Donald Trump | అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు.. లక్షలాది మంది భారతీయులపై ప్రభావం
Executive Order | అధ్యక్షుడి చేతిలో పవర్ఫుల్ ఆయుధం.. ఇంతకీ ఏమిటీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్..?