న్యూయార్క్ : పాలస్తీనా పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్ర్యానికి బాసటగా నిలిచిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) పాలస్తీనియన్ల హక్కులకు ఉగ్ర సంస్ధ హమాస్ ప్రాతినిధ్యం వహించదని స్పష్టం చేశారు. ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లు సమానస్దాయిలో భద్రత, శ్రేయస్సు ఉండాలని ఆకాంక్షించారు. గౌరవంతో స్వేచ్ఛగా జీవనం సాగించేందుకు పాలస్తీనా ప్రజల హక్కుకు తాను మద్దతిస్తానని, వారి ఆకాంక్షలకు హమాస్ అద్దం పట్టదని పేర్కొన్నారు.
ఉగ్రవాద చర్యలను అమెరికా తీవ్రంగా ఖండిస్తుందని అంతకుముందు ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలను సమర్ధించుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్‌లో జరిగిన దానిపై తాను తీవ్రంగా కలత చెందానని, ఉగ్రవాద చర్యలను అమెరికా తీవ్రంగా ఖండిస్తుందని, ఉగ్రవాదం ఏ రకంగానూ సమర్దనీయం కాదని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ తనను తాను కాపాడుకునే క్రమంలో అవసరమైన సాయం అందిస్తామని, ఇజ్రాయెల్‌ను వెన్నంటి ఉంటామని ఆమె పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న మెరుపు దాడులకు దిగిన హమాస్ ఫైటర్లు (Hamas Fighters) ఉత్తర కొరియా ఆయుధాలతో విరుచుకుపడ్డారనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయని చెబుతున్నారు. ఓ మిలిటెంట్ వీడియోతో పాటు ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇదే విషయం వెల్లడించాయి. మరోవైపు మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు తాము ఆయుధాలు విక్రయించలేదని ఉత్తర కొరియా చెబుతోంది. యుద్ధక్షేత్రంలో వాడిన ఉత్తర కొరియా ఆయుధాలకు సంబంధించిన వీడియోను విశ్లేషించిన ఇద్దరు నిపుణులు హమాస్ ఎఫ్-7 రాకెట్ గ్రనేడ్‌తో పాటు, షోల్డర్ ఫైర్డ్ వెపన్స్‌ను వాడినట్టు పేర్కొంటున్నారు. ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తర కొరియా తన ఆయుధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చే మార్గంగా అక్రమ ఆయుధాల రవాణా సాగిస్తోందనేందుకు ఈ ఆధారాలు సంకేతాలు పంపుతున్నాయి.
Read More :