Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బ్రిక్స్(BRICS)పై నోరుపారేసుకున్నారు. బ్రిక్స్‌ను చిన్న సహాయం అని పేర్కొంటూనే.. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని ప్రవేశపెట్టాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ట్రంప్ బ్రిక్స్ సభ్యదేశాలపై 10శాతం ఎగుమతి పన్ను విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. గత పది రోజుల్లో ట్రంప్ హెచ్చరించడం ఇది రెండోసారి. బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా ఉన్నాయి. వైట్ హౌస్‌లో జరిపిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ‘జీనియస్ యాక్ట్’ అనే మొదటి క్రిప్టోకరెన్సీ బిల్లుపై సంతకం చేసిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ బిల్లు స్టేబుల్ కాయిన్ క్రిప్టోకరెన్సీకి నియంత్రణ చట్రాన్ని అందిస్తుందన్నారు. జులై 6-7 తేదీల్లో రియో డిజెనెరోలో బ్రిక్స్ సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే.
అయితే, ఈ సమ్మిట్‌లో బ్రిక్స్ దేశాలు కీలక ప్రకటన చేశాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నియమాలకు విరుద్ధంగా అమెరికా పన్నులు పెంచడంతో ప్రపంచ వాణిజ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మరుసటి రోజే ట్రంప్ అమెరికాకు ముప్పు తలపెట్టేందుకు బ్రిక్స్‌ను స్థాపించారని.. డాలర్‌ను బలహీనపరిచేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయని.. ఆ దేశాలన్నీ పదిశాతం పన్నులుంటాయని హెచ్చరించారు. తాజాగా ట్రంప్ మరోసారి ఈ అంశంపై స్పందించారు. ‘బ్రిక్స్ దేశాలు సమావేశమైతే చాలా మంది దేశాధినేతలు పన్నుల భయంతో ఆ సమావేశానికి హాజరుకాలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. నాతో ఉంటే, డాలర్ బలహీనపడదు. నేను డాలరు దిగజారకుండా ఉంచుతా’నన్నారు. ఇదిలా ఉండగా.. భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) పై 5వ దశ చర్చలు 17న వాషింగ్టన్లో ముగిశాయి. ఈ చర్చలకు భారత ప్రధాని ప్రధాన ప్రతినిధి, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వం వహించారు.