గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 09, 2020 , 09:34:08

అమెరికాలో 30 ల‌క్ష‌లు దాటిన‌ క‌రోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో 30 ల‌క్ష‌లు దాటిన‌ క‌రోనా పాజిటివ్ కేసులు

హైద‌రాబాద్‌:  అమెరికాలో క‌రోనా వైర‌స్ కేసులు.. శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 30 ల‌క్ష‌లు దాటింది.  ఈ విష‌యాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది.  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,31000 మంది మ‌ర‌ణించారు.  అయితే మంగ‌ళ‌వారం మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు సృష్టించింది. ఆ ఒక్క రోజే దేశ‌వ్యాప్తంగా 60 వేల కేసులు న‌మోదు అయ్యాయి.  జూలై 2వ తేదీన న‌మోదైన 55,220 కేసుల రికార్డును మంగ‌ళ‌వారం బ్రేక్ చేసింది.  

కేసుల సంఖ్య ఎలా ఉన్నా.. మ‌ళ్లీ స్కూళ్లు తెర‌వాల‌న్న ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  కొన్ని స్కూళ్ల‌ను రీఓపెన్ చేయాల‌ని వైట్‌హౌజ్ కూడా సూచ‌న‌లు చేసింది.  అయితే వైట్‌హౌజ్ క‌రోనావైర‌స్ టాస్క్‌ఫోర్స్ అధినేత అయిన మంత్రి మైక్ పెన్స్ కొన్ని సూచ‌న‌లు చేశారు.  స్కూళ్లు రీఓపెన్ చేస్తే వాటిపై క‌ఠిన ఆంక్ష‌లు పెట్ట‌రాద‌న్నారు. మ‌రోవైపు కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో ప‌దివేల కేసులు న‌మోదు అయ్యాయి.  


logo