వాషింగ్టన్ : దాదాపు 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక చట్టబద్ధ హోదాను రద్దు చేసేందుకు అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దీంతో వెనెజులా, క్యూబా, హైతీ, నికరాగ్వా అక్రమ వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించేందుకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు అవకాశం లభించింది.
గతంలో జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దాదాపు 5,32,000 మంది వలసదారులకు టెంపరరీ లీగల్ స్టేటస్‌ను మంజూరు చేసింది. దీనిని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. వలసదారులు కోర్టులను ఆశ్రయించారు.