Israel – Hamas War | జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 50 మందిని హమాస్ విడుదల చేయనుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తమ దేశ జైళ్లలో నిర్బంధంలో ఉన్న 150 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టనుంది.
అలాగే గాజాలోకి సహాయ సామగ్రికి అనుమతించనుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇరు వర్గాలు నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ పాటించనున్నాయి.