వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఒడిలో ఫోన్ పట్టుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆ ఫోన్లో మాట్లాడారు. ఖతార్‌పై దాడి చేసినందుకు ఆ దేశ ప్రధానికి క్షమాపణ చెప్పారు. (Netanyahu Apology To Qatar) ఈ ఫొటోను వైట్ హౌస్ విడుదల చేసింది. ఇటీవల ఖతార్‌లోని హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. ఈ సంఘటనలో ఖతార్ పౌరుడు మరణించాడు.
కాగా, మిత్ర దేశమైన ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాస సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ సందర్భంగా ట్రంప్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడించారు.
మరోవైపు ట్రంప్ తన ఒడిలో ఫోన్ పట్టుకోగా నెతన్యాహు క్షమాపణ లేఖ చదివారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించినట్లు ఆయన ఒప్పుకున్నారు. తమ దేశం మళ్లీ అలాంటి దాడి చేయదని హామీ ఇచ్చారు. నెతన్యాహు క్షమాపణలను ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కాగా, వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
Elephant Theft | ఏనుగు చోరీపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Teen Sneak Into Girlfriend’s House | ప్రియురాలిని కలిసేందుకు గోడ దూకిన యువకుడు.. విద్యుదాఘాతంతో మృతి