Ganja | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. కొబ్బరి బోండాల మాటున గంజాయిని ఉంచి నిందితులు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. డీసీఎం వాహనాన్ని, కారును సీజ్ చేశారు.
ఒడిశా నుంచి రాజస్థాన్‌కు హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ. 6.25 కోట్ల విలువైన గంజాయిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. రాజస్థాన్, జోదాపూర్ ప్రాంతానికి చెందిన విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్ వృత్తిరీత్యా డ్రైవర్. రాజస్థాన్‌లోని జోదాపూర్ ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాలో ఏజెంట్‌గా పనిచేసే దేవిలాల్ ద్వారా డీసీఎం యజమాని అయిన రామ్‌లాల్, రాజస్థాన్‌లోని ఆయా ప్రాంతాలలోని స్మగ్లరకు గంజాయి సైప్లె చేసే అయూభ్ఖాన్లతో పరిచయం ఏర్పడింది. ఓడిశా మల్కాన్‌గిరి నుంచి రాజస్థాన్‌కు గంజాయి రవాణా చేస్తే ఒకో ట్రిప్పుకు రూ. 5 లక్షలు ఇస్తామంటూ విక్రమ్ విష్ణోయ్కి ముఠా సభ్యులు హామీ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.