శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 17:51:16

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా సిద్ధం

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా సిద్ధం

వాషింగ్టన్ : అమెరికా రాజకీయాలను, మరీ ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలను పెద్ద ఎత్తున ప్రభావితం చేయడానికి చైనా సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ వెల్లడించారు. అయితే, ఓబ్రియన్ కుట్ర అనే పదాన్ని మాత్రం ఉపయోగించకపోవడం విశేషం. చైనా ప్రారంభించిన ఈ ఆటలో రష్యా, ఇరాన్ దేశాలు కూడా పాల్గొంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సమయంలో కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా ప్రభావం చూపడమే కాకుండా ట్రంప్‌కు సహాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే అతిపెద్ద కార్యక్రమాన్ని చైనా సిద్ధం చేసిందని, అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటున్నారని తెలిపారు. మన ఎన్నికలను చైనాతోపాటు రష్యా, ఇరాన్ దేశఆలు అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. ఇలాంటి కుట్రలను అడ్డుకునేందుకు గట్టి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రష్యా, చైనా, ఇరాన్ దేశాలను స్పష్టంగా హెచ్చరించామని, అమెరికా రాజకీయాల్లో లేదా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని మరోసారి హెచ్చరిస్తున్నామన్నారు.

"40 సంవత్సరాలుగా చైనా గురించి అమెరికా సరైన విదేశాంగ విధానం తయారు చేయలేకపోయింది. వారి మిలిటరీ చేష్టలపై కళ్ళు మూసుకున్నాం. ఈ రోజు అమెరికా స్నేహితులను, పొరుగువారిని చైనా బెదిరిస్తున్నది. చైనా పట్ల ట్రంప్ చాలా కఠినమైన వైఖరి తీసుకున్నారు. చైనా మనలాగే ఉండాలని కోరుకోవడంలో ఎటువంటి సమస్య లేదు. కానీ, అక్కడ మానవ హక్కుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. చరిత్రలో అతిపెద్ద మేధో దొంగతనానికి చైనా పాల్పడింది అని ఎఫ్‌బిఐ డైరెక్టర్ చెప్పారు" అని ఓబ్రెయిన్ వెల్లడించారు.


logo