వాషింగ్టన్ : భారత దేశంపై విధించిన 50 శాతం సుంకాల్లో 25 శాతం మేరకు తగ్గించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ(ఆర్థిక మంత్రి) స్కాట్ బెస్సెంట్ వెల్లడిచారు. అమెరికన్ న్యూస్ ఔట్లెట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
రష్యా నుంచి చమురు దిగుమతిని భారత్ తగ్గించడం భారత వస్తువులపై విధించిన పన్నుల్లో కనీసం 25 శాతం తగ్గించేందుకు అనుకూల పరిస్థితులను సృష్టించిందని తెలిపారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అసమతుల్యతలు ఉన్నాయంటూ 25 శాతం టారిఫ్‌ను, రష్యా నుంచి ముడి చమురును దిగుమతిని కొనసాగిస్తున్నందుకు 25 శాతం టారిఫ్‌ను భారత్‌పై అమెరికా విధించింది.