Iran war | పశ్చిమాసియాలో(West Asia) మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాలు చేసుకున్న శాంతి ఒప్పందానికి పరస్పర దాడులతో బీటలువారాయి. హర్మూజ్ జల సంధిలో(Strait of Hormuz) ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై శుక్రవారం ఇరాన్‌పై(Iran) డ్రోన్లతో దాడి చేసింది. దీంతో అమెరికా ప్రతీకార దాడులు చేపట్టింది.
ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై దాడి చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) స్పష్టం చేసింది. దీనికి బదులుగా ఐఆర్జీసీ కూడా దీటుగా స్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్లే దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా బలగాలు పేర్కొన్నాయి.
హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం భద్రతను కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఇరాన్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటలకే ఇరాన్‌పై యూఎస్ దాడులకు పాల్పడటం గమనార్హం. ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా కారణమని ఇరాన్ ఆరోపించింది. హార్మోజ్ జలసంధిని తెరిచి