US-Iran : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్, అమెరికా మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. రెండు దేశాల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. దీనిపై షెహబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా శనివారం కీలక ప్రకటన చేశారు.
‘‘ఇరాన్, అమెరికా మధ్య అనుకున్నదానికంటే తొందరగానే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కోసం పాకిస్తాన్ సిద్ధమవుతోంది. వచ్చే వారం సాంకేతికమైన అంశాలపై చర్చిస్తాం. అమెరికా, ఇరాన్ చర్చలకు పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉన్నాయి. ఈ చారిత్రక ఒప్పందం దీర్ఘకాలిక శాంతికి పునాది వేస్తుందని భావిస్తున్నాం” అంటూ షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అంతకుముందు కూడా ఈ అంశంపై ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన తుది ప్రతిపాదను అమెరికాకు, ఇరాన్‌కు పంపినట్లు వెల్లడించారు. దీనికి దాదాపు రెండు దేశాలు అంగీకరించాయని, సమన్వయం చేస్తున్నామని, ఫార్మాలిటీస్ పూర్తి కావాలని పాక్ తెలిపింది.
We are closer to a peace deal than ever before. With finalisation likely expected in the next 24 hours, Pakistan is preparing for the electronic signing of the peace deal immediately after, followed by technical level talks next week.
We would like to thank United States of…
— Shehbaz Sharif (@CMShehbaz) June 13, 2026
మరోవైపు అంతకుముందు ఇరాన్ స్పందిస్తూ.. ఇంకా డీల్ కుదరలేదని చెప్పింది. తుది ఒప్పందం ఇంకా కుదరలేదని, ఇంకా చాలా దూరం ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. అమెరికాతో ఒప్పందం కుదిరితే దాన్ని ఇరాన్ బహిరంగంగా వెల్లడిస్తుందని ఆయన తెలిపారు. మరోవైపు ట్రంప్ కూడా ఇరాన్‌తో త్వరగా ఒప్పందం కుదుర్చుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ కూడా అంగీకరించేలా ఒత్తిడి తెస్తున్నారు.