జెరూసలేం, ఏప్రిల్8 : యుద్ధాన్ని తాత్కాలికంగా విరమణ ప్రకటించిన తర్వాత.. 11 నుంచి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు సాగబోతున్నాయి. అయితే, చర్చల ప్రక్రియకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి.
‘యుద్ధానికి ఇది ముగింపు కాదు. ఏ సమయంలోనైనా మళ్లీ పోరుకు దిగుతాం’ అని నెతన్యాహు బుధవారం రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. రెండువారాల పాటు తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని పాటిస్తామని, అయితే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏ సమయంలోనైనా దాడులకు తాము సిద్ధమని నెతన్యాహు అన్నారు.