Chabahar port : ఇరాన్ (Iran) దేశంలోని చాబహార్ పోర్టు (Chabahar port) పై అమెరికా దళాలు (USA Forces) భారీగా దాడులు చేశాయి. ఒక దశలో పోర్టు సిటీ (Port city) లో విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. ఇక్కడి వ్యూహాత్మక మౌలిక వసతులను అమెరికా లక్ష్యంగా చేసుకొన్నట్లు ఇరాన్‌కు చెందిన ప్రెస్ టీవీ వెల్లడించింది. ఈ దాడుల్లో కలంతారి పోర్టు (Kalantari port), మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసమైనట్లు తెలిపింది.
దాడుల తర్వాత తక్షణ సహాయక బృందాలు రెస్క్యూ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఈ పోర్టుపై దాడి జరిగింది. హర్మూజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగపడే నిర్మాణాలు, పరికరాలను లక్ష్యంగా చేసుకొంటున్నట్లు అమెరికా ఈ సందర్భంగా వెల్లడించింది. చాబహార్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రదేశం. ఇది హర్మూజ్‌కు బయట గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు దగ్గరగా ఉంది.
హిందూ మహా సముద్రం నుంచి ఇరాన్ సముద్ర వాణిజ్యానికి అవసరమైన డీప్ వాటర్ పోర్టు ఇక్కడ ఉంది. ఇరాన్‌కు ఇది ఆర్థికంగా కీలక ప్రాంతం. భారత్ పెట్టుబడులతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడి నుంచి అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు సరకులు రవాణా చేయాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో పోర్టుపై అమెరికా దాడులకు పాల్పడటంతో భారత్‌లో టెన్షన్ నెలకొన్నది.