వాషింగ్టన్, ఆగస్టు 12: సుంకాల విధింపులో భారత్‌పై కక్ష పూరితంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన పొరుగు దేశం చైనా పట్ల మాత్రం ఆపేక్షను ప్రదర్శించారు. చైనాతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటించారు.
ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ దేశంపై సుంకాల పెంపు మరో మూడు నెలల పాటు వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య శిఖరాగ్ర సమావేశం ఉన్న క్రమంలో ఈ విరామం వాణిజ్య ఒప్పందంపై చర్చలకు మార్గం సుగమం చేసినట్టు భావిస్తున్నారు.