వాషింగ్టన్: ఇటీవల విడుదల చేసిన మ్యాప్‌లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్‌లోని భూభాగాలుగా చూపించిన అమెరికా ఆకస్మికంగా యూటర్న్ తీసుకుంది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూటీఎస్ఆర్) కార్యాలయం ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఆ మ్యాప్‌ను తొలగించడం గమనార్హం.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన క్రమంలో గత వారం యూటీఎస్ఆర్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఆ మ్యాప్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు దానిపై ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ఆ మ్యాప్‌ను తొలగించారు. మ్యాప్ తయారీలో దొర్లిన లోపం కారణంగా వాటిని భారత్‌లో భాగమన్నట్టు చూపారా? లేక ఈ సమస్యపై తాము మద్దతు ఇస్తున్నామని భారత్‌ణు ప్రలోభపెట్టేందుకు అలా చూపారా? అన్న ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు.