Hurricane Hilary | హరీకేన్ హిల్లరీ (Hurricane Hilary ) తుపాను ప్రభావంతో అమెరికా (America) రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుపాను ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. భీకర గాలులతో కూడిన వర్షం కారణంగా పలు రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. తుపాను కారణంగా దక్షిణ కాలిఫోర్నియాలోని చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. 84 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని స్థానిక అధికారులు తెలిపారు. మంగళవారం పలు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తుపాను బీభత్సం సృష్టిస్తూ భారీ వర్షాలు కురుస్తుండటంతో నెవాడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. అసాధారణమైన వేసవి తుపానుకు తోడు భూమి కంపించడం (Eartquake)తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి (Ojai city) ఈశాన్యాన ఆదివారం మధ్యాహ్నం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. లాస్ఏంజెల్స్ సమీపంలో కూడా 3.1, 3.6 తీవ్రతతో భూమి రెండు సార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు.
#WATCH Floods in Palm Desert, Riverside County, #California 🇺🇸 Due to the effects of Tropical Storm Hilary. #PalmSprings #HurricaneHilary #Hurriquake #SoCalwx #Hurricane #HILARY #Califonia #BREAKINGNEWS #Breaking #HuracanHilary #HurricaneHilary #HurricaneHillary pic.twitter.com/zctvI00BLm
— Nitesh rathore (@niteshr813) August 21, 2023
Palm Springs, California is totally flooded #HurricaneHillary #Hilary pic.twitter.com/uohAEa3qza
— Eric Spracklen🇺🇸 (@EricSpracklen) August 21, 2023
🔊🚨🔊🚨🔊🚨🔊🚨🔊🚨🔊🚨
Para las personas que no se toman en serio el huracán Hilary !
🚨🔊🚨🔊🚨🔊🚨🔊🚨🔊🚨🔊#Huracán #Tiempo #SanDiego #Baja #LosAngeles #Pronóstico #Hillary #Hilary #HuracánHilary #México pic.twitter.com/CcO8GKumjs
— X1 (@Roromantico_007) August 20, 2023
#HuracanHilary
Esto ocurrió ayer en Santa Rosalía, BCS.Ya se está esperando la ayuda con los fideicomisos para desastres naturales…
¡Aahhh no! …
¡¡¡Olvídenlo!!! …
𝗬𝗮 𝘀𝗲 𝗹𝗼𝘀 𝗰𝗵𝗶𝗻𝗴𝗼́ 𝗟𝗼́𝗽𝗲𝘇 𝗢𝗯𝗿𝗮𝗱𝗼𝗿 😡🤬 pic.twitter.com/BiVq3hOt8A
— Pelwchi (@pelwchi) August 20, 2023
Significant flooding in #SantaRosalía.
Be prepared people #HurricaneHilary #Mulegé #BajaCaliforniaSur #México #HuracanHilary pic.twitter.com/t9qiEaCzTV
— CBKNEWS (@CBKNEWS121) August 20, 2023
Also Read..
Pankaj Tripathi | ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి తండ్రి కన్నుమూత
Asia Cup 2023 | ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే.. హైదరాబాదీ ప్లేయర్ తిలక్‌వర్మకు ఛాన్స్
Seema Haider | కరాచీ టు నోయిడా.. థీమ్ సాంగ్ వచ్చేసింది