కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచంలో అందరూ భయపడతారు కానీ, తాను మాత్రం భయపడేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. బ్రిటిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ, తమకు అమెరికాతో శత్రుత్వం లేదని, తాము స్నేహితులమని, అలాంటపుడు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు.
ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్నారు. అమెరికన్లు ట్రంప్‌ను ఎన్నుకున్నారని, వారి ఎంపికను మనం గౌరవించాలని, అదేవిధంగా ఉక్రెయిన్ ప్రజలు తనను ఎన్నుకున్నారని చెప్పారు. అక్టోబరులో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ మ్యాప్‌లను పక్కకు తోసేసినట్లు వచ్చిన వార్తలను జెలెన్స్కీ ఖండించారు. తమ మధ్య సాధారణ పరిస్థితుల్లోనే సంభాషణ జరిగిందన్నారు. తమ మధ్య విరోధం లేదని తెలిపారు.