రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ మృతి
Oksana Shvets | ఉక్రెయిన్పై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ (Oksana Shvets) మరణించారు. రాజధాని కీవ్లోని నివాస భవనాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి.
హైదరాబాద్: ఉక్రెయిన్పై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ (Oksana Shvets) మరణించారు. రాజధాని కీవ్లోని నివాస భవనాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 67 ఏండ్ల ఒక్సానా మృతిచెందారని ఆమె నేతృత్వంలో పనిచేస్తున్న ‘యంగ్ థియేటర్’ ఫేస్బుక్ ద్వారా ప్రకటించింది.
ష్వెట్స్ 1955లో జన్మించారు. ఆమె ఇవాన్ ఫ్రాంకో థియేటర్, కీవ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో అభ్యసించారు. సుదీర్ఘకాలం పాటు థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగిన ఆమె.. ఉక్రెయిన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెరిటెడ్ ఆర్టిస్ట్ అవార్డును అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్టుగానే కాకుండా.. అనేక సినిమాల్లో కూడా ఆమె నటించింది. టుమారో విల్ బీ టుమారో, ది సీక్రెట్ ఆఫ్ సెయింట్ పాట్రిక్, ది రిటర్న్ ఆఫ్ ముఖ్తార్ అనే సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

కాగా, ఉక్రెయిన్పై దాడులను వెంటనే నిలిపివేయాలని హాలీవుడ్ దిగ్గజం అర్నాల్డ్ స్క్వార్జెనెగర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

