Volodymyr Zelensky | వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ఏడాదికి చేరింది. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia)యుద్ధం ప్రారంభించి నేటితో ఏడాది పూర్తైంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్ వీరోచిత ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తోంది. ఈ వార్లో ఇరు దేశాల నుంచి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తైన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky) తన దేశ ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. ‘2023 విజయ సంవత్సరం అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
‘ఫిబ్రవరి 24న మనలోని లక్షలాది మంది ఒక దారిని ఎంచుకున్నారు. తెల్ల జెండాని కాదు.. నీలం, పసుపు రంగు జెండాని ఎంపిక చేసుకున్నాం. పారిపోలేదు.. ఎదుర్కొంటున్నాము, ప్రతిఘటిస్తున్నాం, పోరాడుతున్నాం. ఇది బాధ, దుఃఖం, విశ్వాసం, ఐక్యతా సంవత్సరం. మనం అజేయంగా ఉన్న సంవత్సరం. 2023 మన విజయ సంవత్సరమని మనకు తెలుసు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను తన పోస్టుకు జత చేశారు.
ఇదే సందర్భంలో ఏడాది కిందట ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని జెలెన్స్కీ గుర్తు చేసుకున్నారు. ‘సంవత్సరం క్రితం ఇదే రోజున, ఇదే స్థలం నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రసంగించాను. అది కూడా కేవలం 67 సెకన్లు మాత్రమే’ అని అన్నారు. ‘మేము బలంగా ఉన్నాము. దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మేము అందరినీ ఓడిస్తాము. ఫిబ్రవరి 24, 2022న ఇలా ప్రారంభమైంది. మా జీవితంలో సుదీర్ఘమైన రోజు. అత్యంత కష్టమైన రోజు. ది ఇయర్ ఆఫ్ ఇన్విజబిలిటీ (year of invincibility)’ అని చెప్పుకొచ్చారు.
On February 24, millions of us made a choice. Not a white flag, but the blue and yellow one. Not fleeing, but facing. Resisting & fighting.
It was a year of pain, sorrow, faith, and unity. And this year, we remained invincible. We know that 2023 will be the year of our victory! pic.twitter.com/oInWvssjOI— Володимир Зеленський (@ZelenskyyUa) February 24, 2023
Also Read..
Ukraine | రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది.. ఎవరు తగ్గుతారో! ఎవరు నెగ్గుతారో!
ఉక్రెయిన్లో బైడెన్ ఆకస్మిక పర్యటన
Joe Biden: వాషింగ్టన్ టు కీవ్.. బైడెన్ రహస్య జర్నీ సాగింది ఇలా
Ukraine War | రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి ఎన్ని కోట్లు నష్టం జరిగిందో తెలుసా