ప్రపంచం మొత్తం ఆందోళన కలిగిస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన మొదటి రోజే ఒక జంట వింత నిర్ణయం తీసుకుంది. అదే రోజు పెళ్లి చేసుకొని ఒకటవ్వాలని డిసైడయింది. వారి నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉన్నట్లు ఆ వధువు వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యారీనా అరీవా అనే 21 ఏళ్ల యువతి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సిటీ కౌన్సిల్లో డిప్యూటీగా పని చేస్తోంది.
ఆమె ఫియాన్సీ శివాటోస్లావ్తో మే నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. మే 6న వివాహం చేసుకోవడానికి రెండు కుటుంబాలు నిర్ణయించాయి. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ఎక్కడ ఏ బాంబు పడుతుందో? ఎవరు ఎప్పుడు మరణిస్తారో చెప్పలేని పరిస్థితి. ‘‘మేం చనిపోవచ్చే.. అది జరగడానికి ముందే ఈ బంధంతో కలవాలని అనుకున్నాం’’ అని యారీనా తెలిపింది.
ఈ కారణంగానే ఒక పక్కన యుద్ధ సైరన్లు వినిపిస్తుండగానే.. పెళ్లి ప్రమాణాలు చేసి ఒక్కటయ్యిందీ జంట. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.