Ukraine War | ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగుస్తుందా.. అబుదాబిలో కొనసాగుతున్న శాంతి చర్చలు
Ukraine War : దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Ukraine War : దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అబుదాబిలో రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అమెరికా ఒత్తిడి మేరకు ఉక్రెయిన్ ఈ శాంతి చర్చలకు అంగీకరించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఎలాగైనా ముగింపు పలికేలా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే అమెరికా ఈ చర్యలకు దిగింది. 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఇప్పటికీ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. అయితే, రష్యాదే పైచేయిగా ఉంది. ఉక్రెయిన్ కు చెందిన విద్యుత్ సంస్థలు సహా కీలక ప్రదేశాలపై రష్యా దాడి చేసింది. దీంతో ఉక్రెయిన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. అయినప్పటికీ రష్యాపై పోరాడుతూనే ఉంది. ఇక.. తాజా శాంతి చర్చలకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడారు. యుద్ధానికి ముగింపు పలకడం రష్యా చేతిలోనే ఉందన్నాడు. ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టింది రష్యానే అని గుర్తు చేవారు. తమ దేశం తరఫున చర్చలు జరుపుతున్న టీంను తాను నిరంతరం సంప్రదిస్తున్నానని, అయితే, ఈ విషయంపై ఏమీ చెప్పలేనని ఆయన అన్నాడు. రేపటికల్లా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నాడు. ఇటీవల దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్.. జెలెన్ స్కీని కలిశాడు. అక్కడే ఆయన శాంతి చర్చల గురించి ట్రంప్ అతడికి సూచించాడు.
శాంతి చర్చలు సందర్భంగా తమ దేశ భద్రతకు యూరప్ హామీ ఇవ్వాలని జెలెన్ స్కీ కోరుతున్నాడు. శాంతి ఒప్పందం విషయంలో రష్యా మాత్రం కాస్త ఆలోచించి అడుగులేస్తోంది. ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతమైన డోనెస్క్ ప్రాంతాన్ననని తన ఆధీనంలో ఉంచుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నాడు. కానీ, దీనికి జెలెన్ స్కీ అంగీకరించడం లేదు. ఈ ప్రదేశం దాదాపు 5,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

