రష్యా చొరబాటు కారణంగా ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ మంత్రి మిఖైలో ఫెడోరోవ్ ఒక ట్వీట్ చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ను ఉద్దేశించి చేసిన ఆ ట్వీట్లో..
‘‘మీరు మార్స్‌ను కాలనైజ్ చేసే ప్రయత్నాల్లో ఉండగా.. ఉక్రెయిన్ను ఆక్రమించడానికి రష్యా ప్రయత్నిస్తోంది. మీ రాకెట్లు అంతరిక్షం నుంచి సురక్షితంగా ల్యాండయ్యే సమయంలో.. రష్యా రాకెట్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయి. దయచేసి ఉక్రెయిన్‌కు స్టార్లింగ్ సేవలు అందించండి’’ అని కోరారాయన.
అలాగే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని రష్యన్లను కోరాలని కూడా మస్క్‌ను ఫెడోరోవ్ అడిగారు. ఈ ట్వీట్ తర్వాత ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. మరిన్ని టర్మినల్‌లు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Starlink service is now active in Ukraine. More terminals en route.
— Elon Musk (@elonmusk) February 26, 2022