తిరుమల : అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేయనున్న సెక్యూరిటీ లగేజీ స్కానర్ కోసం ఇండియన్ బ్యాంక్ రూ.37,97,508 టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమల లోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ ప్రణేశ్ కుమార్ విరాళం డీడీని అందజేశారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం.సెల్వరాజ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఇందిరా, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్ర పాల్గొన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.31 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.31 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 64,729 మంది భక్తులు దర్శించుకోగా 22,162 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.