మాస్కో: రష్యా మరోసారి భారీస్థాయిలో డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడికి ప్రతిగా ఉక్రెయిన్ కూడా దీటుగా బదులిచ్చింది. తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో దాదాపు 72-76 డ్రోన్లను కూల్చివేసింది. ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత మంగళవారం కూడా రష్యా దాదాపు 140 డ్రోన్లతో దాడి చేసింది.