Middle East war | పాక్‌కు షాకిచ్చిన యూఏఈ.. వెంటనే అప్పు తీర్చాలని అల్టిమేటం.. 30 ఏళ్ల అప్పు తీర్చబోతున్న పాక్
Middle East war : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌కు యూఏఈ షాకిచ్చింది. తమ దగ్గర తీసుకున్న అప్పును పూర్తిగా, అది కూడా వెంటనే చెల్లించాలని కోరింది. దీంతో ఈ నెలలోనే యూఏఈ అప్పు తీర్చేందుకు పాక్ సిద్ధమైంది.
Middle East war : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌కు యూఏఈ షాకిచ్చింది. తమ దగ్గర తీసుకున్న అప్పును పూర్తిగా, అది కూడా వెంటనే చెల్లించాలని కోరింది. దీంతో ఈ నెలలోనే యూఏఈ అప్పు తీర్చేందుకు పాక్ సిద్ధమైంది. మొత్తం 3.5 బిలియన్ డాలర్ల అప్పును యూఏఈకి పాకిస్తాన్ ఈ నెలలోనే చెల్లించబోతుంది. ఒకవైపు అంతర్జాతీయ రిజర్వ్స్ తక్కువగా ఉన్నా, మరోవైపు ఐఎంఎఫ్ నుంచి ఒత్తిడి ఉన్నా.. పాక్ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు తీర్చేయబోతుంది.
ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా యూఏఈ కూడా ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటుంది. దీంతో తమ బాకీ చెల్లించాలని పాక్‌ను కోరింది. దీనికి పాకిస్తాన్ కూడా అంగీకరించింది. ఈ నెల 11న 450 మిలియన్ డాలర్లు, 17న 2 బిలియన్ డాలర్లు, 23న బిలియన్ డాలర్లను పాక్ చెల్లించేందుకు అంగీకరించింది. సెంట్రల్ బ్యాంకుకు చెందిన 16.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వల నుంచి ఈ నిధులను పాక్ చెల్లించబోతుంది. ఈ అప్పుల్లో మూడు దశాబ్దాల నాటి అప్పు కూడా ఉండటం విశేషం. 1996-97లో పాకిస్తాన్ 450 మిలియన్ డాలర్లను అప్పుగా తీసుకుంది. అప్పట్లో ఒక సంవత్సర కాల పరిమితితో ఈ అప్పు తీసుకుంది. అయితే, ఇంతవరకు చెల్లించలేదు. ఈసారి మాత్రం చెల్లించబోతుంది. నిజానికి పాకిస్తాన్‌కు ఇచ్చిన అప్పు కాల పరిమితిని పొడిగించాలని ఇటీవల యూఏఈ నిర్ణయించింది. దీనిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి.
కానీ, ఈలోగానే ఇరాన్ యుద్ధం ప్రారంభమవ్వడంతో యూఏఈ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డబ్బులు చెల్లించాలని పాక్‌ను కోరింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు యూఏఈ సహా అమెరికా, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు సహాయం అందిస్తున్నాయి. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్‌కు నిధులు అందేలా చూస్తున్నాయి. ఆయ దేశాలు కూడా అప్పులు ఇస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- loan
- Middle East war
- Pakistan
- UAE
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

