హైదరాబాద్, ఆగస్టు 13, (నమస్తే తెలంగాణ): నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సీజేఐ సూర్యకాంత్‌ను ఆహ్వానించడా న్ని విద్యార్థులు వ్యతిరేకించిన వివాదం లో గురువారం పలు కీలక పరిణామా లు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనపై మొదట కన్నెర్రజేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ).. నల్సార్-2026 బ్యాచ్ లా గ్రాడ్యుయేట్ల అడ్వకేట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను తాతాలికంగా నిలిపివేసింది.
అంతలోనే నిషేధంపై పునఃసమీక్ష జరిపి తమకు అందిన నివేదికల ఆధారంగా విద్యార్థులందరూ నిరసన తెలుపలేదని, దీనిపై నల్సార్ వైస్-చాన్స్‌లర్‌తో విచారణ కమిటీ వేసి నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులని తేలి న వారిపై చర్యలు తీసుకుంటామని బీసీ ఐ వెల్లడించింది. తాజా నివేదికల ప్రకారం 2026లో ఉత్తీర్ణులైన నల్సార్ విద్యార్థుల్లో అత్యధికులు నిరసనలు లే దా వివాదాస్పద చర్యల్లో పాల్గొనలేదని, వారు నిర్దోషులని బీసీఐ స్పష్టంచేసింది.