ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని ఖిబర పక్తున్ఖ్వ ప్రావిన్స్‌లో పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. దేశ భద్రతా దళాలు లక్ష్యంగా ఇటీవల దాడులు జరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోందని అధికారులు పేర్కన్నారు.
ఇదే ప్రావిన్స్‌లోని టంక్ జిల్లాలో వ్యాక్సినేషన్ డ్యూటీలో పాల్గొన్న ఇద్దరు పోలీస్ అధికారులను ఇటీవల ఉగ్రమూకలు బలితీసుకున్నాయి. జులైలో డెరా ఇస్మాయిల్ ఖాన్, టంక్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో మోటార్ బైక్‌లపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు నలుగురు పోలీసులను కాల్చి చంపారు. ఇక ఇదే తరహాలో జూన్‌లో నార్త్ వజీరిస్తాన్ ట్రైబల్ జిల్లాలో భద్రతా దళాల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని డాన్ పత్రిక పేర్కొంది.