పీట్స్బర్గ్: అమెరికాలో ఆదివారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. పీట్స్బర్గ్లో ఓ బార్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. అయితే కాల్పులకు కారణం ఏమిటి? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నదీ, లేనిదీ పోలీసులు వెల్లడించ లేదు.
మరోవైపు ఒహియో రాష్ట్రంలోని అక్రోన్లో గల ఒక వీధిలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, 26 మంది గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కెల్లీ అవెన్యూ, 8వ అవెన్యూ మధ్య ఆర్ధరాత్రి జరిగిన ఈ కాల్పుల్లో 27 ఏండ్ల యువకుడు అక్కడికక్కడే మరణించాడు. 24 మందికి పైగా పౌరులు గాయపడ్డారు.