Turkey | పాక్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌పై తుర్కియే (Turkey) విషం చిమ్మిన విషయం తెలిసిందే. భారత్‌ను ఎదుర్కొనేందుకు దాయాది దేశానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. యుద్ధ సమయంలో పాక్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సాయం చేసిన విషయం విదితమే. ఆ డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. అంతేకాదు సైనిక సిబ్బందిని కూడా పాక్‌కు పంపినట్లు తాజా సమాచారం. ఈ క్రమంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ఇద్దరు తుర్కియే సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నివేదించింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌పై పాక్ డ్రోన్లతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ ప్రయత్నాన్ని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను గగనతలంలోనే కూల్చేసింది. మన దేశంపై పాక్ ఉపయోగించిన డ్రోన్లు తుర్కియే నుంచి తెప్పించినవిగా తెలిసింది. దాదాపు 350 నుంచి 400 డ్రోన్లను తుర్కియే పాక్‌కు పంపినట్లు సమాచారం. వాటి వినియోగం కోసం ఆపరేటర్లను కూడా పంపినట్లు తెలిసింది. మన దేశంపై దాడికి పాక్ ప్రయోగించిన డ్రోన్లను సైన్యం కూల్చివేయగా.. వాటి శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. ఈ పరీక్షల్లో అవి తుర్కియేకి చెందిన ‘అసిస్ గార్డ్ సోనగర్’ డ్రోన్లుగా (Turkish Asisguard Songar drones) తేలింది.
తుర్కియే పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ టీఆర్టీ వరల్డ్ ఎక్స్ ఖాతా విత్‌హెల్డ్
మరోవైపు ఆపరేషన్ సిందూర్ వేళ దాయాది దేశానికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పలు అంతర్జాతీయ మీడియా సంస్థలపై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తుర్కియే (Turkey) పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ టీఆర్టీ వరల్డ్ (Turkish broadcaster TRT World)ను కూడా భారత్ బ్లాక్ చేసేసింది. ఆ అకౌంట్‌ను విత్‌హెల్డ్ (withheld)లో ఉంచింది. ఇప్పటికే పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన చైనా ప్రభుత్వ మీడియా (Chinese State Media) గ్లోబల్ టైమ్స్, జిహువా న్యూస్ ఎక్స్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
బాయ్‌కాట్ తుర్కియే..
మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకుంది. యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సాయం చేసిన విషయం విదితమే. ఆ డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్, బాన్ తుర్కియే’ని ట్రెండ్ చేస్తున్నారు. టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువులను భారత్‌లో విక్రయించవద్దని ఇక్కడి వ్యాపారులు నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు భారత పర్యాటకులు (Indian tourists) టర్కీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. శత్రువుకు బహిరంగ మద్దతు తెలిపిన టర్కీ కోసం తాము తమ డబ్బును ఖర్చుపెట్టదల్చుకోలేదని వారు ప్రకటించారు.
Also Read..
Boycott Turkey | బాయ్‌కాట్ తుర్కియే.. దేశవ్యాప్తంగా ఊపందుకున్న నినాదం
Turkey | భారత్‌తో పెట్టుకుంటే అంతే.. నష్టనివారణ చర్యలకు దిగిన టర్కీ