Boycott Turkey | బాయ్‌కాట్ తుర్కియే.. దేశవ్యాప్తంగా ఊపందుకున్న నినాదం
భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకున్నది. యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సాయం చేసిన విషయం విదితమే. ఆ డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది.
- ఆ దేశ టూరిజంపై తీవ్ర ప్రభావం
Boycott Turkey | ఢిల్లీ, మే 13 : భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకున్నది. యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సాయం చేసిన విషయం విదితమే. ఆ డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్, బాన్ తుర్కియే’ని ట్రెండ్ చేస్తున్నారు. మొన్నటివరకు సోషల్‌మీడియాలో కొనసాగిన ఈ ట్రెండ్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అన్ని రంగాలకు వ్యాపిస్తున్నది. ఇప్పటికే తుర్కియే టూరిజంపై దాని ప్రభావం పడింది. ఆ దేశానికి వెళ్లాలనుకునే అనేక మంది భారతీయ పర్యాటకులు విమాన టికెట్లు, హోటళ్ల బుకింగ్‌లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా బుకింగ్‌లు వాయిదా లేదా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తున్నది. రాజధాని అంకారా టూరిజం తీవ్రంగా ప్రభావితమైంది.
యాపిల్ మార్కెట్‌పై ఎఫెక్ట్…
ఈ ప్రభావం తుర్కియే యాపిల్ మార్కెట్‌పై కూడా పడింది. తుర్కియే యాపిళ్లను దిగుమతి చేసుకోవద్దని పుణె వ్యాపారులు నిర్ణయించారు. తుర్కియే యాపిళ్ల టర్నోవర్ ఒక సీజన్లో రూ.1000-1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక్కసారిగా దిగుమతులను తగ్గించుకోవడంతో యాపిళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడి హోల్‌సేల్‌గా 10 కిలోల యాపిళ్ల ధరలు రూ.200-300 వరకు పెరిగాయి. రిటైల్ ధరలు కిలోకు రూ.20-30 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, వాషింగ్టన్, న్యూజిలాండ్‌లతోపాటు మన దేశంలోని హిమాచల్, ఉత్తరాఖండ్‌ల నుంచి యాపిళ్లను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

