Turkey | ఆపరేషన్ సిందూర్ వేళ దాయాది దేశానికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పలు అంతర్జాతీయ మీడియా సంస్థలపై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన చైనా ప్రభుత్వ మీడియా (Chinese State Media) గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా తుర్కియే (Turkey) పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ టీఆర్టీ వరల్డ్ (Turkish broadcaster TRT World)ను కూడా భారత్ బ్లాక్ చేసేసింది. ఆ అకౌంట్‌ను విత్‌హెల్డ్ (withheld)లో ఉంచింది. అంతకు ముందు చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్, జిహువా న్యూస్ ఎక్స్ ఖాతాలను భారత్ విత్‌హెల్డ్‌లో ఉంచిన విషయం తెలిసిందే.
The ‘X’ account of Turkish broadcaster ‘TRT World’ withheld in India. pic.twitter.com/in72SVkubD
— ANI (@ANI) May 14, 2025
మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకుంది. యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సాయం చేసిన విషయం విదితమే. ఆ డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్, బాన్ తుర్కియే’ని ట్రెండ్ చేస్తున్నారు. టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువులను భారత్‌లో విక్రయించవద్దని ఇక్కడి వ్యాపారులు నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు భారత పర్యాటకులు (Indian tourists) టర్కీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. శత్రువుకు బహిరంగ మద్దతు తెలిపిన టర్కీ కోసం తాము తమ డబ్బును ఖర్చుపెట్టదల్చుకోలేదని వారు ప్రకటించారు.
Also Read..
Boycott Turkey | బాయ్‌కాట్ తుర్కియే.. దేశవ్యాప్తంగా ఊపందుకున్న నినాదం
Global Times X Account | చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసిన భారత్
Turkey | భారత్‌తో పెట్టుకుంటే అంతే.. నష్టనివారణ చర్యలకు దిగిన టర్కీ