న్యూఢిల్లీ, జూన్ 18: ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులలో అమెరికా పాల్గొనడంపై వ్యాఖ్యానించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఇజ్రాయెల్‌తో నేను చేతులు కలపొచ్చు.. కలపక పోవచ్చు. నేనేం చేయదలచుకున్నానో ఎవరికీ తెలియదు అని బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సమయం మించిపోయిందని ఆయన అన్నారు. ఇరాన్‌పై చర్యలు అనివార్యమని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. వచ్చే వారం.. వారం లోపలే చాలా పెద్ద పరిణామం ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. వైట్ హౌస్‌లో చర్చలు జరిపేందుకు ఇరాన్ నుంచి ప్రతిపాదన వచ్చిందని ట్రంప్ ధ్రువీకరించారు. అయితే ఇరాన్ నుంచి ఈ ప్రతిపాదన ఎప్పుడు వచ్చిందో ఆయన వివరించలేదు. ఇరాన్‌కు పూర్తిగా రక్షణ వ్యవస్థ లేదు. గగనతల రక్షణ వ్యవస్థ అంటూ ఏదీ లేదు అని ఆయన తెలిపారు. ఇరాన్‌పై దాడిని కొనసాగించవలసిందిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చెప్పినట్లు పరోక్షంగా వెల్లడిస్తూ ముందుకు సాగండి అని తాను అన్నట్లు ట్రంప్ చెప్పారు.