Illegal Migrants | క్రిస్మస్ సందర్భంగా (Christmas Offer) అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు (Illegal Migrants) ట్రంప్ యంత్రాంగం (Trump administration) బంపర్ ఆఫర్ ప్రకటించింది. యూఎస్‌ను స్వతంత్రంగా వీడితే ఇచ్చే బోనస్‌ను మూడు రెట్లు పెంచింది. డిసెంబర్ 31లోపు యూఎస్‌ను స్వతంత్రంగా వీడితే బోనస్‌గా 3వేల డాలర్లు ఇవ్వనున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) విభాగం ప్రకటించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,70,738 అన్నమాట. ఇంతకుముందు ఈ బోనస్ 1000 డాలర్లుగా ఉండేది.
అంతేకాకుండా బోనస్తోపాటూ స్వదేశానికి వెళ్లేందుకు ఉచిత విమాన టికెట్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీహెచ్ఎస్ (Department of Homeland Security) ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్‌ను స్వచ్ఛందంగా వీడేవారు సీబీపీ (Customs and Border Protection) హోమ్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత స్వదేశానికి వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు, బోనస్ చెల్లించడం వంటివన్నీ డీహెచ్ఎస్ చూసుకుంటుందని పేర్కొంది. గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు వారు ఎప్పటికీ యూఎస్‌కు తిరిగి రాలేరని స్పష్టం చేసింది.
Also Read..
Donald Trump | బహుశా వాటిని ఆమె ఐరన్ చేస్తారనుకుంటా.. భార్య లోదుస్తులపై ట్రంప్ బహిరంగ వ్యాఖ్యలు
Donald Trump: ఇండోపాక్ న్యూక్లియర్ వార్ ఆపాను : డోనాల్డ్ ట్రంప్
Muhammad Yunus | బంగ్లాదేశ్‌లో సకాలంలోనే ఎన్నికలు.. అశాంతి వేళ యూనస్ కీలక ప్రకటన