Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏం మాట్లాడినా సంచలనమే. తన ప్రత్యర్థులు, అమెరికా వ్యతిరేక దేశాలపై విరుచుకుపడే ట్రంప్.. తాజాగా తన భార్య, ఫస్ట్‌లేడీ మెలానియా(Melania Trump) దుస్తుల (Melanias undergarments) గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
నార్త్ కరోలినా (North Carolina)లో జరిగిన ఓ బహిరంగ ర్యాలీలో ట్రంప్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తన భార్య మెలానియా ట్రంప్ లోదుస్తుల గురించి మాట్లాడి అందరినీ విస్మయానికి గురిచేశారు. తన ప్రసంగంలో ఆగస్టు 2022లో ఫ్లోరిడాలోని తన నివాసం మార్-ఎ-లాగోలో ఎఫ్‌బీఐ జరిపిన సోదాల గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఆ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు తన భార్య మెలానియా గదిలోకి వెళ్లారని ఆమె క్లోసెట్ మొత్తం వెతికారని చెప్పారు.
మెలానియాకు సంబంధించిన వస్తువులన్నింటినీ వెతికినట్లు చెప్పారు. అక్కడ ఆమె లోదుస్తులు చాలా పద్ధతిగా, పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసి ఉన్నాయన్నారు. ‘బహుశా ఆమె వాటిని ఐరన్ చేస్తారనుకుంటా’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. పబ్లిక్ ర్యాలీలో భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భార్య లోదుస్తులపై ట్రంప్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read..
Vince Zampella: కాల్ ఆఫ్ డ్యూటీ.. వీడియో గేమ్ సృష్టికర్త విన్స్ జంపెల్లా మృతి
Navy Plane Crash | అమెరికాలో కూలిన మెక్సికన్ నేవీ విమానం.. ఐదుగురు మృతి
కెనడాలో స్టార్టప్ వీసాల జారీ నిలిపివేత.. ఆ దేశ ఇమిగ్రేషన్ శాఖ నిర్ణయం