న్యూఢిల్లీ: కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్ సిరీస్ సృష్టికర్త విన్స్ జంపెల్లా(Vince Zampella) మృతిచెందారు. వీడియో గేమ్ రంగంలో నిష్ణాతుడిగా ఆయనకు పేరున్నది. ఆయన వయసు 55 ఏళ్లు. ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనే వీడియో గేమ్ కంపెనీ ఆయన స్థాపించారు. ఆదివారం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కంపెనీ వెల్లడించింది. కానీ ఏ కారణం చేత ఆయన మరణించారో చెప్పలేదు. అయితే కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
2010లో రెస్పాన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని జంపెల్లా స్థాపించారు. ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ కంపెనీకి ఇది అనుసంధానమైంది. వీడియో గేమ్ డెవలపర్ కంపెనీ ఇన్ఫినిటీ వార్డు కంపెనీలోనూ ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేశారు. కాల్ ఆఫ్ డ్యూటీ సిరీస్‌ను ఆ కంపెనీయే డెవలప్ చేసింది. వీడియో గేమ్ పరిశ్రమలో జంపెల్లా ప్రభావం చాలా గాఢమైందని ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు. కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్‌తో జంపెల్లా చాలా పేరుప్రఖ్యాతలు సంపాదించారు.
గేమింగ్ ఇండస్ట్రీలో ఆ వీడియో సిరీస్‌కు చాలా ఫాలోయింగ్ ఉన్నది. కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ సుమారు 50 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. 2003లో తొలి సారి వరల్డ్ వార్ 2 పేరుతో వీడియో గేమ్‌ను రిలీజ్ చేశారు. ఆ గేమ్‌కు చెందిన 50 కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి. స్టార్ వార్స్ జేడీ: ఫాలెన్ ఆర్డర్, స్టార్ వార్స్ జేడీ: సర్వైవర్ లాంటి యాక్షన్ అడ్వెంచర్ వీడియో గేమ్‌లను క్రియేట్ చేశాడతను.