Donald Trump | రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో విడివిడిగా సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky)తో ట్రంప్ సంభాషించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను భద్రత నిమిత్తం తమకు అప్పగించాలని ట్రంప్ సూచించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియా తెలిపారు.
ఇక ఉక్రెయిన్‌తో పూర్తి స్థాయి కాల్పుల విమరణ ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. కాల్పుల విమరణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం పుతిన్‌తో మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ ద్వారా కొన్ని అంశాల్లో మాత్రమే క్లారిటీ వచ్చింది. కేవలం అణు విద్యుత్తు కేంద్రాలపై మాత్రమే దాడి చేయకుండా ఉండేందుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. 30 రోజుల కాల్పుల విమరణ ఒప్పందం విఫలం కావడంతో.. రష్యా, ఉక్రెయిన్ దేశాలు మళ్లీ వైమానిక దాడుల (Air Attacks)కు దిగాయి. రెండు దేశాలు ప్రత్యర్థి కేంద్రాలపై అటాక్ చేశాయి.
Also Read..
Air Attacks: ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్ తర్వాత రష్యా, ఉక్రెయిన్ వైమానిక దాడులు
Indian student | హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యా్ర్థి అరెస్ట్