వాషింగ్టన్, మే 23: యూరోపియన్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న వస్తువులపై 50 శాతం సుంకం విధిస్తామని, జూన్ 1 నుంచి ఈ కొత్త టారిఫ్లు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
సుంకాల విధింపుపై ఆయా దేశాలతో జరిపిన చర్చలు విఫలంకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.