హైదరాబాద్ : లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు, కీలకమైన జలమార్గం మూసివేతపై దౌత్య చర్చలను ప్రమాదంలో పడేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Trump) కీలక వాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందంపై తాను ఆశావాద దృక్పథంతో ఉన్నానని చెప్పినప్పటికీ, హర్మూజ్ జలసంధిలో(Strait of Hormuz) టోల్‌ట్యాక్స్ (Toll tax)వసూలు చేస్తున్నారనే వార్తలపై టెహ్రాన్‌ను హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ట్యాంకర్ల నుంచి ఇరాన్ రుసుములు వసూలు చేస్తోందని నివేదికలు వస్తున్నాయని, ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్రూత్ వేదికగా వెల్లడించారు. బ్యారెల్‌కు డాలర్ చొప్పున వసూలు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. క్రిప్టో కరెన్సీ, చైనా యువాన్లలో పన్ను చెల్లించాలని కోరుతున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నౌకల నుంచి పన్నులు వసూలు చేయకపోవడమే మంచిదని ట్రంప్ అన్నారు. ఇరాన్ అలా చేయకూడదని, ఒకవేళ చేస్తే పన్నులను వెంటనే ఆపాలని సూచించారు.