Donald Trump | ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం (Israel-Iran War) తీవ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజులుగా రెండు దేశాలూ ఒకరిపై ఒకరు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇక ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులను ఆపమని ఇజ్రాయెల్‌ను ఒప్పించడం ప్రస్తుతానికి సాధ్యం కాదన్నారు.
న్యూజెర్సీలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘ఇరాన్‌పై సైనిక కార్యకలాపాలను ఆపమని ఇజ్రాయెల్‌ను ఒప్పించడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుతంగా దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులు మాత్రం పేలవంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో దాడులు ఆపమని ఇజ్రాయెల్‌ను అభ్యర్థించడం కష్టమని నేను భావిస్తున్నా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read..
Donald Trump | నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్‌ను నామినేట్ చేసిన పాక్ ప్రభుత్వం
Nuclear Talks: దాడులు ఆగేవరకు.. అణు చర్చలు ఉండవు : ఇరాన్
Ayatollah Ali Khameni | ‘మహిళలు పువ్వు లాంటివారు’.. వైరలవుతున్న ఖమేనీ పాత పోస్టులు..!