Gold Cards | ట్రంప్ గోల్డ్ కార్డుకు భారీ గిరాకీ.. ఒక్కరోజులోనే 1000 విక్రయం
Gold Cards | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే గోల్డ్ కార్డు (Gold Card) ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది.
Gold Cards | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే గోల్డ్ కార్డు (Gold Card) ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 (Investor visa) స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 5 మిలియన్ డాలర్లు (సుమారు 44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. ట్రంప్ ప్రకటించిన ఈ గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది.
కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 1,000 గోల్డ్ కార్డులు విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తాజాగా వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 5 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా 37 మిలియన్ల మందికి గోల్డ్ కార్డును కొనుగోలు చేయగల సామర్థ్యం ఉంది. ఒక మిలియన్ మంది వీటిని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. వీటిద్వారా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉంది’ అని లుట్నిక్ పేర్కొన్నారు. అసలు ఈ గోల్డ్ కార్డు ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఎవరిదన్న ప్రశ్నకు బదులిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్‌దే అని బదులిచ్చారు. ‘పెట్టుబడిదారు జాన్ పాల్సన్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన ఇది. అధ్యక్షుడి ఆలోచనను అమలు చేయడమే నా బాధ్యత. ఇందుకోసం నా వద్ద ప్రణాళిక ఉంది’ అని చెప్పుకొచ్చారు.
పౌరసత్వ కార్డుల ద్వారా వేగంగా జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొంత వరకు తగ్గించవచ్చు అన్న అభిప్రాయంలో ట్రంప్ ఉన్నారు. ఈ క్రమంలో ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డు ఆఫర్లను ప్రకటించారు. ఈబీ-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు గ్రీన్ కార్డు ఇస్తారు. గోల్డ్ కార్డులను అమ్మనున్నామని, 5 మిలియన్ల డాలర్లకే ఆ కార్డును ఇవ్వనున్నట్లు ట్రంప్ గత నెల ప్రకటించారు.
Also Read..
Twitter Bird Logo | వేలానికి ట్విట్టర్ పాత లోగో.. భారీ ధర పలికిన బ్లూ పిట్ట
Ladakh | చైనా దురాక్రమణను భారత్ ఎన్నటికీ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టీకరణ
Donald Trump | సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్ జీతం సొంత డబ్బుతో చెల్లిస్తా : డొనాల్డ్ ట్రంప్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

