Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి మహిళ అయిన కమలా హారిస్ (Kamala Harris) ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కంటే తానే బాగుంటానని ట్రంప్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ విధంగా నోరుపారేసుకున్నారు. ఇటీవల టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కమల ఫొటోను ప్రస్తావిస్తూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు పలికారు.
‘కమలా హారిస్ కంటే నేనే బాగుంటా. ఆమె ఫొటోలు సరిగా లేకపోవడంతో టైమ్ మ్యాగజైన్ వాళ్లు స్కెచ్ ఆర్టిస్ట్‌ను హైర్ చేసుకున్నారు’ అని అహంకారపూరితంగా హేళన చేశారు. అంతేగాక కమలా హారిస్ ర్యాడికల్ లిబరల్ అని కూడా వ్యాఖ్యానించారు. కాగా, అనారోగ్య కారణాలతో డెమోక్రాట్స్ అభ్యర్థి బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.