Donald Trump | పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి స్పందించారు. ఆ దాడి ఓ చెత్త పనిగా అభివర్ణించారు. రెండు దేశాల (India-Pak) మధ్య సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని చెప్పుకొచ్చారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం ట్రంప్ ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో భారత్-పాక్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. ‘నాకు భారత్, పాకిస్థాన్.. రెండు దేశాలూ చాలా దగ్గర. కశ్మీర్ ప్రాంతంలో 1,500 ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఆ రెండు దేశాల గురించి నాకు బాగా తెలుసు. ఏదో ఒక విధంగా దాన్ని పరిష్కరించుకుంటాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. పెహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఓ చెత్త పని. ఆ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఉగ్రదాడి ఘటనపై స్పందించిన ట్రంప్.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, భారత ప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.
#WATCH | On #PahalgamTerroristAttack, US President Donald Trump says, “I am very close to India and I’m very close to Pakistan, and they’ve had that fight for a thousand years in Kashmir. Kashmir has been going on for a thousand years, probably longer than that. That was a bad… pic.twitter.com/R4Bc25Ar6h
— ANI (@ANI) April 25, 2025
Also Read..
Bilawal Bhutto : మా నీళ్లైనా పారాలి.. లేక మీ రక్తమైనా పారాలి: బిలావల్ భుట్టో వార్నింగ్
సంయమనం పాటించండి.. భారత్, పాక్కు ఐక్యరాజ్యసమితి పిలుపు