శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 28, 2020 , 08:06:45

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనే.. నామినేట్‌ చేసిన ట్రంప్‌

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనే.. నామినేట్‌ చేసిన ట్రంప్‌

వాషింగ్టన్ ‌: అమెరికా సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా జడ్జి అమీ కోనే బారెట్‌(48)ను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో అత్యంత మేథాసంపత్తి కలిగిన వారిలో ఒకరైన అమీ కోనేను జస్టిస్‌గా నామినేట్‌ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అమీ కోనే సుప్రీంకోర్టు జస్టిస్‌గా ఎన్నికైతే అతి పిన్న వయసులో ఈ పదవి చేపట్టిన మహిళగా చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. కాగా సుప్రీంకోర్టు జస్టిస్‌ రుథ్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌ (87) ఇటీవల మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. కోనే బారెట్ నియామకంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo