వాషింగ్టన్ : యూఎస్ ఎయిడ్‌ను నిలిపివేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యం యూటర్న్ తీసుకుంది. పొరపాటున దానిని నిలిపివేశామని, దానిని పునరుద్ధరిస్తున్నామని తాజాగా ప్రకటించింది.
యూఎస్ ఎయిడ్ నిలిపివేతలో భాగంగా ఇటీవల 14 దేశాలకు ఆహార సహాయాన్ని బంద్ చేసిన అమెరికా జరిగిన పొరపాటును గ్రహించి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించిన మానవతా సహాయ ఒప్పందాలను పునరుద్ధరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యూఎస్ ఎయిడ్‌ను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంవల్ల ఆకలి చావులు సంభవిస్తాయని, పథకాన్ని పునరుద్ధరించాలని ఐరాస కోరింది.