గాజా: ఇజ్రాయిల్ రక్షణ దళాలు గురువారం అటాక్ చేశాయి. హమాస్ స్నైపర్ ఉగ్రవాది(Sniper Killed) అహ్మద్ హసన్ సలామే అసౌరక్క ఆ దాడిలో హతం అయ్యాడు. హమాస్‌కు చెందిన నుక్బా దళంలో ఆయన కమాండర్‌గా చేశాడు. ఇజ్రాయిల్‌లో జరుగుతున్న అనేక దాడుల్లో అహ్మద్ అసౌరక్క కీలక పాత్ర పోషించాడు. అక్టోబర్ 7వ తేదీన దక్షిణ ఇజ్రాయిల్‌లో జరిగిన దాడిలోనూ అతని పాత్ర ఉన్నది. అక్కడ జరిగిన దాడిలో సుమారు 1189 మంది ఇజ్రాయిలీలు మరణించారు.
ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ తాజా ఆపరేషన్ చేపట్టింది. ఐడీఎఫ్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆ అటాక్ జరిగింది. ఇజ్రాయిల్ సెక్యూర్టీ ఏజెన్సీ కూడా కీలక సమాచారం అందజేసింది. నార్తర్న్ గాజాలో ఉన్న బీట్ హనౌన్ ఏరియాపై టార్గెట్ స్ట్రయిక్ జరిగింది. అక్కడ నుంచి అసౌరక్క స్నైపర్ దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అతని ఆదేశాల ప్రకారమే ఇజ్రాయిల్ దళాలు, కమ్యూనిటీపై దాడులు జరిగాయి.
ఈ ఆపరేషన్‌కు చెందిన వీడియోను ఐడీఎఫ్ షేర్ చేసింది. చాలా కచ్చితత్వంతో ఓ ఇంటిపై వైమానిక అటాక్ చేశారు. ఆ దాడితో ఉగ్రవాది చనిపోయినట్లు తేలింది. ఈ ఆపరేషన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ దాడిలో సాధారణ ప్రజలు గాయపడలేదు.
ELIMINATED: A Leading Hamas Sniper and Nukhba Forces Commander who Participated in the Oct. 7 Massacre
IAF aircraft conducted a precise and targeted strike to eliminate the Hamas terrorist Ahmed Hassan Salame Alsauarka in the area of Beit Hanoun in northern Gaza.
Alsauarka was… pic.twitter.com/OopAWl5HYl
— Israel Defense Forces (@IDF) June 20, 2024