Christopher Wood : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని భారత ప్రభుత్వం అలీనోద్యమ (నాన్ అలైన్మెంట్) విధానాన్ని కొనసాగించిందని జఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టఫర్ ఉడ్ (Christopher Wood) అన్నారు. తన వీక్లీ రిపోర్ట్ ‘గ్రీడ్ అండ్ ఫియర్’లో పుతిన్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు.
2021 తర్వాత పుతిన్ తొలిసారి భారత్‌లో పర్యటించారని, ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న క్రమంలో పుతిన్ పర్యటించడం రష్యాకు భారత్ మద్దతుగా నిలిచినట్లు కాదని అన్నారు. మోదీ ప్రభుత్వం తమ అలీన విధానాన్ని కొనసాగిస్తుందనేది స్పష్టమవుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఇతర దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు భారత్ సిద్ధంగా లేదని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌కు చెందిన వ్యూహాత్మక ప్రాంతం క్రిమియాను 2014 లోనే రష్యా స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో కూడా ఉక్రెయిన్‌తో యుద్ధంపై భారతదేశం తటస్థంగా లేదని, శాంతి పక్షాన మాత్రమే నిలుస్తుందని మోదీ ఉద్ఘాటించారు. దౌత్యపరమైన మార్గాల్లో దీన్ని ముగించాలని చెప్పిన మోదీ.. అందుకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.