Donald Trump | రష్యా-ఉక్రెయిన్ పోరు కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధమే : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | రష్యా-ఉక్రెయిన్ (Russia- Ukraine) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు.
Donald Trump : రష్యా-ఉక్రెయిన్ (Russia- Ukraine) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. గత నెల రోజుల్లో యుద్ధంలో దాదాపు 25 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
రక్తపాతం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. గత నెలలో 25 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో ఎక్కువమంది సైనికులే ఉన్నారని తెలిపారు. బాంబులవల్ల మరికొందరు చనిపోయారని, ఇది వెంటనే ఆగిపోవాలని, అందుకు తాము చాలా కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. ఇలాంటి పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని, అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.
నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో పురోగతి లేకపోవడంపై ట్రంప్ అసహనంతో ఉన్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ ఆయా దేశాల అధికారుల నుంచి మాటలు కాకుండా ఫలితాలు కోరుకుంటున్నారన్నారు. చర్చలతో విసిగిపోయిన అధ్యక్షుడు చర్యలకు సిద్ధమైనట్లుగా తెలిపారు. ఈ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడంలో ట్రంప్ పరిపాలనా సిబ్బంది చురుకుగా ఉన్నారని చెప్పారు.
యుద్ధం ముగించేందుకు ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 20 పాయింట్లతో కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. దీన్ని అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పటికే అందించినట్లు తెలిపారు. డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించేందుకు సిద్ధంగా లేమని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

